2006లో దేవదాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని. నిర్మాత స్రవంతి రవికిశోర్ తమ్ముడు కొడుకుగా తెరంగేట్రం చేసిన రామ్ మొదటి సినిమాతోనే తన ఎనర్జీతో మెప్పించాడు. వైవిఎస్ చౌదరి డైరక్షన్ లో వచ్చిన దేవదాస్ సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే సుకుమార్ డైరక్షన్ లో జగడం మూవీ చేశాడు.  


జగడంలో రామ్ నటనకు యూత్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమా ఫలితం తేడా కొట్టినా రామ్ కు మంచి క్రేజ్ తెచ్చింది. ఇక రెడీ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. తన స్టైల్ తో యూత్ ని ఆకట్టుకున్న రామ్ ఒకనొకదశలో జూనియర్ పవర్ స్టార్ అవుతాడని అనుకున్నారు. అయితే వరుస హిట్లు మనోడికి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ను తీసుకురావడంతో దానికి తగినట్టుగానే ఫలితాలు వచ్చాయి.   


జగడం ఫ్లాప్ అయినా క్రేజ్ రాగా రామ్ కెరియర్ లో గణేష్ ఫ్లాప్ అతన్ని వెనక్కి నెట్టేసింది. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ కూడా దెబ్బ వేసింది. మళ్లీ కందిరీగ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది. కరుణాకరణ్ డైరక్షన్ లో వచ్చిన ఎందుకంటే ప్రేమంట సినిమా కూడా భారీ అంచనాలతో వచ్చి తుస్సుమన్నది. ఆ దారిలోనే ఒంగోలు గిత్త, మసాల ఫ్లాప్ అయ్యాయి. పండుగ చేస్కో కాత పర్వాలేదు అనిపించగా మళ్లీ శివంతో షాక్ ఇచ్చాడు రామ్.


నేను శైలజా మూవీ మళ్లీ రామ్ కు మంచి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత హైపర్ అలా వచ్చి ఇలా వెళ్లగా.. ఉన్నది ఒకటే జింగది సినిమా బాగున్నా ఆకట్టుకోలేదు. రామ్ లాస్ట్ మూవీ హెలో గురు ప్రేమ కోసమే కూడా యావరేజ్ గా మిగిలింది. లేటెస్ట్ ఇస్మార్ట్ శంకర్ అతనిలోని కసి బయట పెట్టింది. 13 ఏళ్ల కెరియర్ 17 సినిమాల ఎక్స్ పీరియెన్స్ రామ్ లోని నటుడిని వెలికి తీసేలా చేశాయి. ఇస్మార్ట్ శంకర్ లో అతని నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలానే రామ్ తన ప్రతి సినిమాకు కష్టపడితే ఎనర్జిటిక్ స్టార్ స్క్రీన్ నేమ్ కు న్యాయం చేసినట్టు అవుతుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: