టాలీవుడ్ లో ఓ వార్త సంచలనం సృష్టించింది, అది డైరెక్టర్ హరీష్ శంకర్ తో జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త సినిమా తీస్తున్నాడని, ఒప్పందం కూడా అయిందని. ఇందులో అంత ఆశ్యర్యపోవాల్సిందేముంది అనుకుంటున్నారా..

ఎన్టీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ‘ రామయ్యా వస్తావయ్యా’ సినిమా హరీష్ శంకర్ వైఫల్యం వల్లనే ఫెయిల్ టాక్ వచ్చిందని అందరికి తెలిసిందే కదా. ఈ విషయంలో హరీష్ పై ఎన్టీఆర్ తో సహా ఆయన అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసారని వార్తలు వినపడిన సంగతి తెలిసిందే. అలాంటిది ఎన్టీఆర్ మళ్లీ హరీష్ తోనే కొత్త సినిమాకు ఒప్పుకోవడం సంచలనమే కదా అంటున్నారు.

అయితే ఇది పూర్తిగా కామెడి ఎంటర్ టైనర్ అంటున్నారు, ప్రస్తుతం హరీష్ అల్లు అర్జున్ తో సినిమా తీసేందుకు రెడీ  అయ్యాడు. బన్నీ ‘రేసుగుర్రం’ పూర్తయ్యాక ఇది మొదలవుతుంది. ఎన్టీఆర్ కూడా ‘రభస’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అంటే మళ్లీ వీరిద్దరి సినిమా ప్రారంభం కావడానికి ఏడాది అంత కంటే ఎక్కువే పడుతుందంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: