రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’లో నటించే ఆఫర్ ఇస్తానంటే ఎవరు ఊరుకొంటారు. కాకపోతే కాస్త ఖర్చవుతుందని చెప్పినా వెనకాడరు. ఓ మహిళా అదే చేసింది. ఆర్.ఆర్.ఆర్ లో ఆఫర్ ఇప్పిస్తానని నమ్మబలికిన వ్యక్తులని నమ్మి రూ. 50లక్షలు పోగొట్టుకొంది. అది కూడా ఆమె లాయర్ కావడం గమనార్హం.


జస్ట్ డయల్ లో మహిళా న్యాయవాది ఫోన్ నెంబర్ తీసుకొని.. సినీ నిర్మాత ఆదిత్యను మాట్లాడుతున్నానని, చాలా సిన్మాలు తీశానని, నాకు డైరెక్టర్ రాజమౌళి తెలుసని సినిమాల్లో నటించేందుకు ఆసక్తి ఉందా అన్ని అడిగారట. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో తల్లి పాత్రకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి.. ఫిల్మ్ ఛాంబర్ ఐడి కార్డు, మా ఐడి కార్డు, టివి సీరియల్ కార్డు తదితర వాటిని తీసుకోవాలని చెప్పడంతో దశల వారీగా డబ్బులు గుంజారట.


చివరకు బాధిరాలి షిఫ్ట్ కారుని కూడా కొట్టేశారట. చివరికి తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళా న్యాయవాది బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులని అరెస్ట్ చేశారు. మరో 13 మంది పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: