డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో రామ్ ల కలయికలో ఎన్నో అంచనాల మధ్య నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఇక మొన్న యుఎస్ఏ నుండి పాజిటివ్ టాక్ రావడం, ఆపై ఇక్కడ విడుదలైన సినిమా కూడా బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటూ ఉండడంతో డైరెక్టర్ పూరి, హీరో రామ్ సహా ఇస్మార్ట్ శంకర్ యూనిట్ మొత్తం  అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. 

నిజానికి సినిమాలో అక్కడక్కడా కొన్ని బోల్డ్ సీన్స్ మరియు డబుల్ మీనింగ్ డైలాగులున్నాయని కొందరి నుండి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ, సినిమా యూత్ మరియు మాస్ ని బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా హీరోని తనదైన మాస్ స్టయిల్లో చూపించే పూరి, ఈ సినిమాలో కూడా రామ్ ని పక్కా మాస్ కుర్రాడిగా ప్రెజెంట్ చేయడం, అలానే తెలంగాణ స్లాంగ్ లో అతడితో డైలాగులు పలికించడం వంటివి సినిమాకు ప్లస్ పాయింట్స్ గా వినపడుతున్నాయి. 

ఇకపోతే నిన్నటి నుండి దాదాపుగా అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా, బి మరియు సి సెంటర్లలో మాత్రం మరింత అదరగొడుతూ దూసుకెళ్తున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఇప్పటివరకు హీరో రామ్ కెరీర్ లో వచ్చిన సినిమాల కలెక్షన్లను ఈ సినిమా ఎంతో సునాయాసంగా దాటేసే అవమాశం ఉందని సమాచారం. మొత్తానికి ఈ ఒక్క సినిమాతో అటు పూరికి, ఇటు హీరో రామ్ కు మంచి హిట్ దొరికినట్లయింది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: