ఆంధ్రా మరియు తెలంగాణాలో 'ఇస్మార్ట్ శంకర్' మొదటి రోజు ఆకర్షణీయమైన ప్రీ-బుకింగ్స్ తో  మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని, మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకాన్ని మేకర్స్ లో కలిగేలా చేసింది. పూరి మాస్ హీరోయిజంకి రామ్ ఎనర్జీటిక్ యాక్టింగ్ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగా పేలింది. ఈ చిత్రం రెండు రాష్ట్రాలలోని అనేక కేంద్రాలలో మంచి సంఖ్యలో హౌసేఫుల్ నమోదు చేసుకుంటూ మొదటిరోజు 7.8 కోట్లు వసూళ్లు చేసింది.


మొదటి రోజు ఈ సినిమా నిజాం లో 3.43, సీడెడ్ లో  1.2, వైజాగ్ లో 0.86, ఈస్ట్ లో 0.50, వెస్ట్ లో 0.40, కృష్ణ లో 0.53, గుంటూరు లో 0.57 మరియు నెల్లూరు లో 
0.30 కోట్లు వసూళ్లు చేయగా, మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 7.8 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ సినిమాగా దూసుకుపోతుంది. దీంతో బి ఏ రాజు ఆనందంతో ట్వీట్ కూడా చేసారు.


ఈ చిత్రం అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటోంది. ప్రీమియర్ ప్రదర్శనలకు మంచి ఆక్యుపెన్సీ రేటును నమోదు చేసుకుంది. తరువాతి ప్రదర్శనలకు కూడా అదే మంచి రెస్పాన్స్ రావడం విశేషం. నివేదికల ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు యుఎస్ బాక్సాఫీస్ వద్ద 0.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఈ చిత్రం వారాంతంలో 1 మిలియన్  ను దాటనుంది అని అంచనా. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 900 కి పైగా స్క్రీన్లలో విడుదలైంది.


నివేదికల ప్రకారం, రామ్ పోతినేని నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ 16 కోట్లకు పైగా వసూలు చేసింది. ఏదైతేనేం విజయం కోసం ఎదురు చూస్తున్న ఇద్దరికీ ఈ సినిమా ఊరటనిస్తూ మళ్లీ ఫార్మ్ లోకి తీసుకొచ్చింది అని భావించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: