లక్కును నమ్ముకున్న ప్రపంచం అది. సినిమా హిట్ అయితేనే చాన్సులు వస్తాయి. ఎంత అందం ఉన్నా, మరెంత నటన వచ్చినా కూడా హిట్టునే చూస్తారు మరి. అటువంటిది ఓ అమ్మడు గత కొన్నాళ్ళుగా చేస్తున్న ప్రయత్నానికి ఇపుడు సరైన రిజల్ట్ వచ్చిందా అంటే అవుననే అంటున్నారు.  ఆమె నటించిన లేటెస్ట్ మూవీ హిట్ అయి కూర్చుంది. ఇక అమ్మడు అక్కడ ఉంటుందో అని ఒకటే చర్చర్లు మొదలయ్యాయి.


నభా నటేష్. టాలీవుడ్లో సుధీర్ బాబు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఆ తరువాత ఒకటి రెండు మూవీస్ చేసినా కూడా అవి  ఫట్ అయ్యాయి. దాంతో ఆమె సోషల్ మీడియానే నమ్ముకుని అక్కడే అందాల  విందు చేస్తూ వచ్చింది. దాన్ని చూసిన పూరీ జగన్నాధ్ ఆమెను ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నాడు.


అంతే ఈ గ్లామర్ డాల్  ఒక్కసారిగా చెలరెగిపోయింది. అందాల ప్రదర్శన హద్దులు దాటించేసింది. ఇక చూస్కో నా తడాఖా అన్నట్లుగా రెచ్చగొట్టుడుతో సై అనేసింది. ఈ మూవీలో నభా నటేష్ గ్లామర్ షోకు  మంచి మార్కులే పడ్డాయి. ఆమె ఇపుడు టాలీవుడ్ కి హాట్ ఫేవరేట్ అయినా షాక్ తినాల్సిన పనిలేదని అంటున్నారు. మరి మూవీ హిట్ అయింది, ఆఫర్లు ఇక రావడమే తరువాయి అంటోందిట.



మరింత సమాచారం తెలుసుకోండి: