నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల తర్వాత భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ సాంగ్‌ను విడుదల చేశారు. 
'రారా.. జగతిని జయించుదాం...' 


అనంత శ్రీరామ్‌ రచించిన 'రారా.. జగతిని జయించుదాం.. రారా చరితని లిఖించుదాం..' అంటూ సాగే పాటను అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత నేతృత్వంలో పృథ్వీచంద్ర, బాషెర్‌మాక్స్‌ ఆలపించారు. ఈ పాటలోని ర్యాప్‌ను కూడా బాషెర్‌మాక్స్‌ క్రియేట్‌ చేశారు. చక్కని పదాలతో అనంతశ్రీరామ్‌ రాసిన ఈ పాట అందర్నీ ఇన్‌స్పైర్‌ చేసేలా ఉంది. దానికి తగ్గట్టుగానే సింగర్స్‌ ఇద్దరూ అద్భుతంగా ఆలపించారు. అనిరుధ్‌ మ్యూజిక్‌ మెస్మరైజ్‌ చేసేలా ఉంది.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: