మొదటి స్వతంత్ర సంగ్రామానికి ముందే బ్రిటిష్ వాళ్ళను ఎదురించి పోరాడిన సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి గొప్ప యోధుడి కథను మెగాస్టార్ చిరంజీవిగారు తన 151వ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అదే ‘సైరా నరసింహారెడ్డి’ . ఇలాంటి చక్కటి పోరాటప్రతిమ కలిగిన కథను చిరంజీవిలాంటి స్టార్ ఎంచుకోవడం ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు.


ఇక ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాంచరణ్ తన సొంత సంస్థ అయిన కొణిదల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతదర్శకుడు.ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటులు వివిధ పాత్రలతో అలరించనున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు ‘గోసాయి వెంకన్న’ పాత్ర పోషిస్తుండగా, ఇక నరసింహారెడ్డి భార్య ‘సిద్దమ్మ’ పాత్రలో నటి నయనతార నటిస్తున్నారు.


అలాగే తమిళ నటుడు విజయ్ సేతుపతి ‘రాజా పాండి’ అనే పాత్రలో, కన్నడ నటుడు సుదీప్ ‘అవుకు రాజు’ అనే పాత్రలో కనిపించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో నిర్మాత ఎలాంటి ఖర్చుకు వెనకాడకుండా భారీస్థాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాంధీజయంతి నాడు విడుదల కానున్న ఈ చిత్రం చిరంజీవికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: