ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న విలక్షణ నటుడు జగపతి బాబు, ఇటీవల కొన్నాళ్లుగా విలన్ గా అలానే తండ్రి గా పలు పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానం సంపాదించి దూసుకెళ్తున్నారు. ఇక ఇటీవల వచ్చిన పలు సూపర్ హిట్ సినిమాల్లో జగపతిబాబు పోషించిన రోల్స్ కు ఎంతో పేరు కూడా రావడం జరిగింది, ఆ విధంగా హిట్టైన సినిమాల్లో అయన కూడా కొంత పా లు పంచుకున్నారు అనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్, యువ డైరెక్టర్ అనిల్ రావిపూడిల కలయికలో రూపొందుతున్న లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు. 

ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా నుండి జగపతి బాబు అర్ధాంతరంగా తప్పుకున్నట్లు రెండు రోజులుగా పలు మీడియా వేదికల్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తన కోసం దర్శకుడు అనిల్ రాసుకున్న క్యారెక్టర్ జగపతి బాబుగారికి నచ్చి ఆ సినిమా చేయడానికి ఒప్పుకోవడం జరిగిందని, కానీ తీరా సెట్స్ మీదకు వెళ్లేసరికి ఆ క్యారెక్టర్ లో కొన్ని మార్పులు చోటుచేసుకోవడంతో, జగపతి బాబు ఆ సినిమా నుండి బయటకు వచ్చారు అనేది ప్రస్తుతం పుకారవుతున్న వార్త. ఇక కాసేపటి క్రితం ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర తన అధికారిక ట్విట్టర్ ద్వారా జరిగిన అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు. 

నిజానికి జగపతి బాబు గారు మా సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేయవలసి ఉంది, కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆయన ఆ క్యారెక్టర్లో నటించడం లేదు, అయితే రాబోయే రోజుల్లో ఆయనతో కలిసి తప్పకుండా పనిచేస్తాం, మా పరిస్థితులను అర్ధం చేసుకున్న గొప్ప ఫ్రెండ్లీ నేచర్ గల వ్యక్తి జగపతి బాబు గారు, అంటూ అనిల్ తన ట్వీట్ లో తెల్పడం జరిగింది. దీనితో జగపతి బాబు తన క్యారెక్టర్ నచ్చక సరిలేరు నీకెవ్వరు నుండి తప్పుకున్నారు అంటూ వస్తున్న వార్తలకు ఒక్కసారిగా చెక్ పడ్డట్లయింది......!!


మరింత సమాచారం తెలుసుకోండి: