తెలుగు సినిమా పరిశ్రమలో దూసుకుపోతున్న అగ్ర నాయకురాలు స్లిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ యొక్క సోదరడు అమన్ ప్రీత్ సింగ్ కూడా అదే సినిమా ఫీల్డ్ లోకి రావటం విశేషం. అమన్ ప్రీత్ సింగ్ 2017 లో రాక్ అండ్ రోల్ అనే షార్ట్ ఫిలింతో తన కెరీర్ ని ప్రారంభించారు. తాజాగా తను ఒక మూవీలో హీరోగా నటిస్తున్నారు.


మూవీకి మన యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున టాప్ మోస్ట్ హిట్ చిత్రం అయినా నిన్నే పెళ్ళాడతా మూవీ టైటిల్, అమన్ ప్రీత్ సింగ్ యొక్క మూవీ టైటిల్ కావటం విశేషం. ఈ చిత్రానికి వైకుంఠ బోను దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నాగ్ శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా నాగార్జునకు రకుల్ ప్రీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపింది.


తన సోదరుడుని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని సంతోషంగా రకుల్ అమన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈ చిత్ర బృందానికి కూడా ఆల్ ద బెస్ట్ తెలిపారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ స్నేహితురాలైన మంచు లక్ష్మి కూడా అమన్ కు విష్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు అమన్ చేతుల్లో మొత్తం మూడు చిత్రాలూ ఉన్నట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: