దగ్గుబాటి రానా కిడ్నీ సమస్యతో కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నాడు. ఇప్పటివరకు మందులతో నెట్టుకువచ్చినా ఇప్పుడు రానాకు కిడ్నీ మార్పిడి తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. కిడ్నీ మార్పిడి కోసం రానా కుటుంబ సభ్యులు అందరూ అమెరికా వెళ్ళారు. రానా కుటుంబంలో ఎవరి కిడ్నీ అయితే మ్యాచ్ అవుతుందో, ఒకవేళ కిడ్నీ మ్యాచ్ అయితే వారికి అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ చేయబోతున్నారని తెలుస్తుంది. 
 
అమెరికాలో రానా ఆపరేషన్ జరుగుతున్నందుకు నాగ చైతన్య, అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళుతున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాకు మూడు రోజులు గ్యాప్ దొరకటంతో అల్లు అర్జున్ అమెరికాకు వెళుతున్నాడట. నిజానికి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అల్లు అర్జున్ కు ఈ మూడు రోజులు కూడా షూటింగ్ ఉంది. కానీ ఒక సీనియర్ నటుడు కాల్షీట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో షూటింగ్ మధ్యలో మూడు రోజులు బ్రేక్ వచ్చింది. 
 
హీరో నాగచైతన్య, రానా బావా బావమరుదులు. నాగచైతన్య బాల్యం అంతా రానా ఫ్యామిలీలోనే గడిపాడు. వెంకీమామ సినిమాలో కూడా రానా గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన నాగచైతన్య కూడా ప్రస్తుతం అమెరికాకు ప్రయాణమయ్యాడు. మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ షో ప్రారంభం అవుతూ ఉండటంతో నాగార్జున వెళ్ళట్లేదని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: