ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు అనే చెప్పాలి. తన ఆకట్టుకునే యాంకరింగ్ స్టైల్ తో ఎందరో అభిమానులను సంపాదించిన శ్రీముఖి, త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంటున్నట్లుగా ఇటీవల కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. 

ఇక ఇటీవల ఆమె ఈటివి ప్లస్ ఛానల్ లో తనకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన పటాస్ అనే షో నుండి సడన్ గా తప్పుకోవడంతో, ఆమె బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలాన్నిచ్చాయి. అయితే ఈ విషయమై అసలు నిజా, నిజాలు ఏంటో తెలియక కొద్దిరోజుల నుండి ఆమె అభిమానులు తెగ ఫీల్ అయి పోతున్నారు. ఇక నేడు కొన్ని మీడియా మాధ్యమాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఆ వార్త నిజమే అని అర్ధం అవుతుంది. ఇక గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ షో లో త్వరలో పాల్గొనే నిమిత్తం తనని తాను అన్ని విధాలా పూర్తిగా సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారట శ్రీముఖి. 

అంతేకాదు ఈ విషయం ఇప్పటికే ఆమె కుటుంబసభ్యులు సహా ఆమె సన్నిహితులందరికి తెలిసిపోయిందట. అయితే నిన్నమొన్నటివరకు ఈ విషయాన్ని దాచాలని ఎంత ట్రై చేసినప్పటికీ, ఇంకొక రెండు రెండు రోజుల్లో ఎలాగూ షో ప్రారంభం కాబోతోంది కాబట్టి వారందరూ ఈ విషయాన్ని బహిరంగంగానే అందరితోనూ చెపుతున్నారట. మరి ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం, బిగ్ బాస్ షోలో మరింత సందడి నెలకొన్నట్లే........!!   


మరింత సమాచారం తెలుసుకోండి: