బద్రి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసాడు పూరీ జగన్నాథ్. కెరీర్ తొలి రోజుల్లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి లాంటి సూపర్ హిట్లు తీసాడు పూరీ జగన్నాథ్. పోకిరి, దేశముదురు సినిమాలతో పూరీ జగన్నాథ్ తో ఒక్క సినిమా ఐనా చేయాలని ప్రతి హీరో అనుకునేలా చేసాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ను పూరీతో కెరీర్ స్టార్ట్ చేయించాడంటే పూరీ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 
 
కానీ పోకిరి సినిమా ఏ నిమిషాన ఇండస్ట్రీ హిట్ అయిందో పూరీ తీసే కథలే మారిపోయాయి. పోకిరి సినిమా తరువాత పూరీ తీసిన సినిమాల్లో పూరీ జగన్నాథ్ కథ విషయంలో రొటీన్ అయిపోయాడు. పూరీ సినిమాల్లో హీరో క్యారక్టర్ అంటే ఇలానే ఉంటాడు అనేలా ఒకే తరహా పాత్రలు పూరీ రాస్తున్నాడు. ఈ కారణం వలనే గత కొన్నేళ్ళుగా పూరీ జగన్నాథ్ తీసిన సినిమాలన్నీ ఫ్లాపులు అవుతున్నాయి. 
 
గడిచిన ఆరేళ్ళలో పూరీ సినిమాల్లో హిట్ అయిన సినిమా "టెంపర్" మాత్రమే. ఈ సినిమాకు కథ వక్కంతం వంశీ అందించాడు. చాలా సంవత్సరాల తరువాత నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమాలో కూడా కథ, కథనంపై కొద్దిపాటి విమర్శలొచ్చాయి. పూరీ అభిమానులు మాత్రం కథ విషయంలో పూరీ ఇంకొంచెం ఏకాగ్రత పెట్టినా, వేరే రచయితల కథలతో తీసినా ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: