మాస్ మసాలా సినిమాలను తనదైన శైలిలో తీసే  దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ టాక్ తో హుషారుగా ఉన్నాడు. దాదాపు చాలా రోజుల తర్వాత పూరికి విజయం వచ్చింది. టెంపర్ తర్వాత సరైన హిట్ రాలేదు. ఆ లోటుని ఇస్మార్ట్ శంకర్ తీర్చాడనే చెప్పాలి. నిన్న విడుదలయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతుంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో రికార్డుల దిశగా పరుగులు పెడుతుంది. ఇప్పటికీ పదహారు కోట్ల గ్రాస్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
 
పూర్తి హైదరాబాదీ కుర్రాడిలా తెలంగాణ యాసలో మాట్లాడే రామ్ నటన అందరినీ ఆకర్షిస్తుంది. మంచి మాస్ మసాలా సినిమా లోటుని ఇస్మార్ట్ శంకర్ తీర్చిందని చెప్పాలి. రామ్ కి కూడా చాలా రోజుల తర్వాత హిట్ వచ్చింఅని చెప్పాలి. చెప్పాలంటే ఈ సినిమా ముగ్గురికి కమ్ బ్యాక్ సినిమాగా చెప్పుకోవచ్చు. సంగీత బ్రహ్మ మణిశర్మ గారికి, రామ్, పూరికి ఒక కమ్ బ్యాక్ గా సినిమాగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది.
 
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. అలాగే మహేష్ బాబు తో సినిమా గురించి అడిగితే, మహేష్ తో పోకిరి, బిజినెస్ మేన్ లాంటి సినిమాలు చేసానని ఆ తర్వాత ఒక సినిమా చేయాలనుకున్నానని, కానీ మహేష్ బాబు హిట్లున్న దర్శకులతో మాత్రమే చేస్తాడని అందుకే కుదర్లేదని చెప్పాడు.
 
ఈ విషయాన్ని ఇంతకుముందు చాలా సార్లు చెప్పాలనుకున్నానని, కానీ చెప్పలేకపోయానని, మహేష్ అభిమానులు మాత్రం పదే పదే అదుగుతున్నారని. వాళ్ళకి నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు అని అన్నాడు. "జనగనమణ " సినిమాని మహేష్ తో చేస్తున్నానని ప్రకటించాక మహేష్ బాబు నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆ సినిమా పక్కకి వెళ్ళిపోయింది.  మరి ఇస్మార్ట్ శంకర్ తో విజయం అందుకున్న పూరితో మహేష్ చేస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా వీరిద్దై కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: