టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్ ఇటీవల కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లు లేక కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఎన్నో అంచనాల మధ్య రామ్ హీరోగా అయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి టాక్ తో హిట్ దిశగా దూసుకుపోతోంది. పూరి మార్క్ టేకింగ్, హీరోయిజం మరియు డైలాగ్స్, అలానే రామ్ మార్క్ యాక్టింగ్, డ్యాన్సింగ్ మరియు ఫైట్ సీక్వెన్స్ లతో ఇస్మార్ట్ మూవీ అదరగొట్టింది. నిన్న విడుదలైన ఈ సినిమా రెండు రోజులుగా దాదాపుగా అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్  కలెక్షన్లతో దూసుకువెళుతోంది. ఇక ఈ సినిమా సాధిస్తున్న విజయానందంలో ఉన్న ఇస్మార్ట్ శంకర్ టీమ్, త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ ని తీసే ప్లాన్ లో ఉంది, 

అందు నిమిత్తం 'డబుల్ ఇస్మార్ట్' పేరుతొ ఆ సినిమాకు ఇప్పటికే టైటిల్ ని కూడా నిర్ణయించి దానిని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు పూరి తెలిపారు. అయితే నేడు పూరికి సంబంధించి ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు సూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత పలుమార్లు మహేష్ తో పూరి సినిమా చేద్దాం అనుకున్నప్పటికీ అది ఇప్పటివరకు కుదరలేదు. ఇక ఈ విషయమై ఇటీవల ఒక మీడియా ఛానల్ తో పూరి మాట్లాడుతూ, మహేష్ బాబుతో జనగణమన అనే సినిమా చేయాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను అని, కానీ ఆయన మాత్రం హిట్స్ లో ఉంటె తప్ప దర్శకులను పిలవరు అంటూ కామెంట్ చేసారు. అయితే తనకు మహేష్ కంటే, అయన ఫ్యాన్స్ అంటేనే ఎంతో ఇష్టం అని, ఎందుకంటే తన డైరెక్షన్ లో మహేష్ బాబును చూడడం వారికి ఎంతో సంతోషం కలిగిస్తుందని, అందువల్లనే రేపు జనగణమన సినిమా కూడా తప్పకుండా మహేష్ తోనే తీయాలని వారు కోరుకుంటున్నట్లు పూరి తెలిపారు. 

ఇదిగో ఇప్పుడు ఇదే కామెంట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే ఒకప్పుడు పూరి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తాను చేసిన పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాల కథలు పూర్తిగా వినిపించకుండానే మహేష్ తో సినిమా చేయడం జరిగిందని, తనను జీవితంలో మహేష్ బాబు నమ్మినంతగా మరెవ్వరూ నమ్మలేదని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటి కామెంట్ ను అప్పటి మాటలతో కంపేర్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ పూరి పై ఫైర్ అవుతున్నారు. అప్పుడేమో మా హీరోని పొగిడి, ఇప్పుడు ఏదో ఒక హిట్ దొరికింది కాబట్టి ఇలా నిందలేయడం తగదని, అలానే మహేష్ చేసిన పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలకు ముందుకు పూరి ఫ్లాప్స్ లో ఉన్న విషయం ఆయనకు గుర్తు లేదా, మరి ఆ విషయాలు మరిచి ఇప్పుడు ఉన్నట్లుండి మహేష్ పై ఎందుకు నిందలు వేస్తున్నారని వారు మండిపడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది......!!


మరింత సమాచారం తెలుసుకోండి: