గత కొన్ని రోజులుగా సైరా సినిమాలో ఏం జరుగుతున్నదో అర్ధం కావడం లేదు.  చాలా సైలెంట్ గా ఉంటోంది.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.   సినిమా  వివరాలు బయటకు రావడం లేదు.  మెగాస్టార్ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు.  


ఆగష్టు 22 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు.  దీనికోసమే పనిచేస్తున్నారు.  చారిత్రాత్మక సినిమా కావడంతో...విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన వర్క్స్ ఎక్కువగా ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో తేడా వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  


విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్భుతంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. ఆలస్యం జరిగిన పర్వాలేదు. ఎక్కడా ఎలాంటి మిస్టేక్ జరగకూడదని ప్లాన్ చేసుకున్నారు.  సినిమాకు సంబంధించిన ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకను అలాగే, ప్రమోషన్స్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తారట.  


దీనిని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు.  ఇందులో మెగాస్టార్ తో పాటు అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి  తదితరులు నటిస్తున్నారు.  నయనతార మెయిన్ హీరోయిన్ కాగా, తమన్నా, అనుష్కలు కీలక పాత్ర చేస్తున్నారు.  మెగాస్టార్ 151 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ  మూవీ దసరా కానుకగా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: