బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్ రవికుమార్ తో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా తరువాత బోయపాటితో సినిమా చేయాల్సి ఉంది.  బోయపాటితో సినిమా చేయకుండా ఉంటాడని అనుకోవడం తప్పే అవుతుంది.  బాలయ్య కెరీర్లో రెండు బెస్ట్ హిట్స్ ఇచ్ఛన దర్శకుడు బోయపాటి.  


అయితే, ఇటు పూరితో కూడా బాలయ్య సినిమా చేయాల్సి ఉన్నది.  ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్టయితే సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పారు.  అనుకున్నట్టుగా పూరి స్మార్ట్ హిట్ కొట్టాడు.  బాలయ్యతో సినిమా తప్పకుండా ఉంటుంది.  అందులో సందేహం అవసరం లేదు.  


చాలా కాలంగా ఇండస్ట్రీలో నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్త ఇది.  ఎప్పుడు పరిచయం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.  ఆయనే బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ.  మోక్షజ్ఞను సినిమాల్లో పరిచయం చేయాల్సిన ఛాన్స్ ను పూరికి అప్పగిస్తే బాగుంటుంది కాదా.  


మెగాస్టార్ తన కొడుకు రామ్ చరణ్ ను పూరీనే ఇంట్రడ్యూస్ చేశారు.  ఆ సినిమా సూపర్ హిట్టైంది.  ఇప్పుడు రామ్ చరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు.  సో, మోక్షజ్ఞను కూడా పూరి డైరెక్షన్లో లాంచ్ చేస్తే ఎనర్జిటిక్ గా బాగుంటుంది కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: