దక్షిణాదిన ది బెస్ట్ నటులు అనుకునే వాళ్లలో విక్రమ్ కూడా ఒకరు.  తనలో చాలా టాలెంట్ ఉన్నది.  కథను బట్టి దర్శకుడిని బట్టి టాలెంట్ బయటకు వస్తుంది. కథ ప్రకారం ఎలా కావాలంటే అలా మారిపోతాడు.  ఇందుకు ఉదాహరణ ఐ సినిమా అని చెప్పొచ్చు.  అందులో సన్నగా మరీనా వ్యక్తిగా విక్రమ్ నటన అమోఘం.  


అపరిచితుడు సినిమా కూడా ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. కాగా, విక్రమ్ కీరోల్ పోషించిన మిస్టర్ కెకె సినిమా రిలీజ్ అయ్యింది.  కీరోల్ అని అందుకు అంటున్నానంటే..విక్రమ్ మేకోవర్ చూస్తే ఎవరికైనా సరే ఇది భారీ యాక్షన్ సినిమా అనుకుంటారు.  


తీరా థియేటర్ కు వెళ్తే.. విక్రమ్ కు సంబంధించిన రోల్ తక్కువగా ఉన్నది.  భారీ మేకోవర్ తో అదరగొట్టినా సినిమా విషయం వచ్చే సరికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.  ఇది సినిమాకు మైనస్ అయ్యింది.  ఇదే గెటప్ తో విక్రమ్ తో మంచి కథతో తీసి ఉంటె మిస్టర్ కెకె మరోలా ఉండేది.  


కమల్ హాసన్ నిర్మించిన సినిమా కావడం పైగా అక్షరా హాసన్ హీరోయిన్ గా చేయడంతో.. ఆమెకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. గృహిణిగా చాలా చక్కగా నటించి మెప్పించింది.  మరోవైపు అభి హాసన్ కూడా మెప్పించాడు. వీరిద్దరి పాత్రలు సినిమాలు హైలైట్ అయ్యాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: