సిల్వర్ స్క్రీన్ మీద సిక్స్ ప్యాక్ అంటు హీరోలు చొక్కాలిప్పేస్తే తప్పేం లేదు. కానీ హీరోయిన్ మాత్రం  కాస్త నడుము చూపిస్తే కొంతమంది కామెంట్స్ చేసేస్తుంటారు. ఇక ఫుల్ గా ఎక్స్‌ఫోజింగ్ చేస్తే హద్దులు దాటేసిందని నానా రచ్చ చేస్తుంటారు. అంతేకాదు లిప్ లాక్స్ రొమాంటిక్ సీన్స్ అయితే చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళే మళ్ళీ బుద్ధిమంతుల్లా లెక్చర్లు ఇస్తుంటారు. టాప్ పొజీషన్‌లో ఉన్న హీరోయిన్స్ అయితే ఇలాంటివి చూసి మేము ఆర్టిస్టులం కథ డిమాండ్ చేసింది కాబట్టే అలా నటిస్తున్నాం. మాకేమన్నా సరదా నా అంటూ రివర్స్ అవుతుంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలే ఇండస్ట్రీలో బాగా వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా అంతే. ఇది బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ అమలా పాల్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి నానా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సాధారణ థ్రిల్లర్ సినిమా అంటే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకుని ఉండేవారు కాదేమో కానీ ఈ సినిమాలో అమల నగ్నంగా నటించిన సీన్ ఉండడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అదొక్కటే కాకుండా ఇంట్రెస్టింగ్ ప్రోమోస్.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలతో పాటే దుమారం కూడా రేగుతోంది. ఇదిలా ఉండగానే తాజాగా ఈ సినిమా నుండి మరో తమిళ వెర్షన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అమలా కాస్ట్యూంస్ కి బదులుగా క్రైమ్ సీన్ లో 'కాషన్: డు నాట్ క్రాస్ ది లైన్' అని రాసి ఉండే పసుపు రంగు స్ట్రిప్ ను దుస్తుల లాగా చుట్టుకుని కనబడుతోంది. 

ఈ పోస్టర్ సినిమాపై మరింతగా ఆసక్తిని  కలిగిస్తోంది.  ఇప్పటికే ఈ పోస్టర్లతో ఆసక్తి నెలకొంది కాబట్టి సినిమాలో కంటెంట్ కూడా ఉంటే అమలా పాల్ కు మంచి హిట్ దక్కడం ఖాయమే. థ్రిల్లర్ జోనర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్య సుబ్రమణియన్.. శ్రీ రంజని.. వివేక్ ప్రసన్న ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రదీప్ కుమార్.  ఈ సినిమాకు దర్శకుడు రత్నకుమార్.  'ఆమె' తెలుగు వెర్షన్ కు రాంబాబు కల్లూరి.. విజయ్ మోరవెనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: