ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఒకరోజంతా పడుతుంది. ఈ విషయం సినీ ప్రపంచంలో ఉన్న ఎవరికైనా తెలిసిన విషయమే. ఆస్కార్ అవార్డ్ గ్రహీతగా, ప్రపంచ స్థాయిలో గుర్తించదగ్గ, గర్వించదగ్గ వ్యక్తి రెహమాన్. తను సంగీతమందించిన ప్రతీ సినిమా ఒక అద్భుతం. అంతేకాదు తెలుగు, తమిళం, హిందీలలో ఎన్నో రికార్డ లను సాధించారు. ఇక కమల్ హాసన్ అంటే ఒక డిఫ్రెంట్ క్యారెక్టర్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో గొప్ప సినిమాలను తీశాడు. ఇంతటి గొప్ప వ్యక్తులు కలిసి  'భారతీయుడు', 'తెనాలి' సినిమాలకు పనిచేశారు. 

దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్ళీ కమల్-రెహమాన్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. కమల్‌ నటిస్తున్న 'తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌' సినిమాకి రెహమాన్‌ సంగీతం   అందించనున్నారు. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. 'నీ భాగస్వామ్యంతో చిత్రబృందానికి మరింత బలాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు రెహమాన్‌. మనం స్క్రిప్ట్‌ను ఎంత డెవలప్‌ చేసినా కొన్ని సినిమాలు మాత్రమే సరైన, అసలైన సంతృప్తినిస్తాయి. వాటిలో 'తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌' ఒకటి. 

ఈ సినిమా కోసం మీరు చూపుతున్న ఎగ్జైట్‌మెంట్‌ను మిగిలిన చిత్రబృందానికి కూడా పంచుతాను' అని తెలిపారు. ఇక 'తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌' రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా అని కోలీవుడ్ మీడియా లేటెస్ట్ న్యూస్. చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. రెహమాన్‌ రాకతో మళ్లీ చిత్రీకరణను ప్రారంభించారు. లైకా ప్రొడక్షన్స్‌, రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-2 లో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కమల్ కి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: