సినిమాలు చూసే సొసైటీ పాడైపోతుందని కొందరంటుంటే సొసైటీలో జరిగేవే..నిజ జీవితాలలో జరుగుతున్నవే మేము తెరమీద చూపిస్తున్నామని కొందరు దర్శకులు అంటుంటారు. ఈ విషయాలలో ఎన్నో సార్లు ఎన్నో రకాల డిబేట్స్ ని చూశాము. సినిమాలో ఒక పాత్ర ప్రభావం బయట జనాల మీద బాగా ప్రభావం చూపుతుందని చాలామంది అంటుంటారు. ఈ సంగతి కూడా ఎన్నోసార్లు మనం చూశాము. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాల మీద బాగా కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. అలాంటివే నాగార్జున నటించిన మన్మథుడు-2 మీదా వస్తున్నాయి. రక రకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇక రీసెంట్‌గా రకుల్ కి సంబంధించి కూడా ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. 

చాలామంది ఈ విషయంలో రకుల్ ని రౌండప్ కూడా చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం రకుల్ మన్మథుడు-2 ట్రైలర్ లో స్మోక్ చేస్తూ కనిపించడమే. సినిమాలో పాత్ర ఏ విధంగా ఉంటే అలా మేం నటిస్తాం. అంతే కానీ సినిమాలో మేం పోషించే పాత్ర ఏదైనా చెడు చేస్తే దాన్ని మేం ప్రమోట్‌ చేసినట్టు కాదు కదా. నిజ జీవితంలో మేం వాటినే ఫాలో అవుతున్నట్టూ కాదుగా. అంతేకాదు నా సినిమాలలో అలాంటి సన్నివేశాలను చూసి నన్ను కామెంట్ చేసేవాళ్లను పట్టించుకోను కూడా అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇదంతా తను స్మోక్ చేస్తూ కనిపించిన ట్రైలర్ తెచ్చిన తంటా..ఒక రిలీజైన ట్రైలర్ లో ఈ బిట్ లేకపోతే ఈ రచ్చ ఉండేది కాదుగా అని కూడా అంటోంది.

అంతేకాదు నాకు వారంలో నచ్చినవన్నీ తినడానికి ప్రత్యేకంగా పెట్టుకునే రోజు కూడా ఉండదు. నా చుట్టూ ఉండేవాళ్లకు తెలుసు.. నేను ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాముఖ్యత ఇస్తానో. 'కబీర్‌ సింగ్‌'లోనూ షాహిద్‌ సిగిరెట్‌ తాగాడు. అతను పొగతాగడాన్ని ప్రోత్సహిస్తున్నట్టా? కాదుగా.. అంటు షాహిద్ కపూర్ సపోర్ట్ తీసుకుంది. సినిమాలో స్మోక్‌ చేసినంత మాత్రాన అవి మా నిజజీవితంలో చేస్తామని కాదు. సినిమాకు, నిజజీవితానికి తేడాను అర్థం చేసుకోవాలి. విమర్శలకు రియాక్ట్‌ అయితే ప్రతీది పట్టించుకోవాలి... అంటూ స్మూత్ గా కౌంటర్ ఇచ్చింది రకుల్‌. నాగార్జున, రకుల్‌ జంటగా నటించిన 'మన్మథుడు 2' ఆగస్ట్‌ 9న రిలీజ్‌ కానుందన్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: