తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ..ఇలా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా చిన్న సినిమాలే హిస్టరీని క్రియోట్  చేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. ఇక తెలుగులో చిన్న సినిమాగా విడుదలై మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకున్న సినిమా కేరాఫ్‌ కంచరపాలెం. ఈ సినిమాఇప్పుడు తమిళంలో నిర్మించబోతున్నారని లేటెస్ట్ అప్‌డేట్. శ్రీ షిరిడీ సాయి మూవీస్‌ పతాకంపై ఎం.రాజశేఖర్‌రెడ్డి, జీవన్‌  కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి హేమంబర్‌ జాస్తీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగులో మంచి విజయాన్ని సాధించిన కేరాఫ్‌ కంచరపాలెం సినిమాని తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి చేయనున్నామని చెప్పారు. 

ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాల్సి ఉంటుందని ఇది నిజజీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తయారు చేసిన కథ అని తెలిపారు.
ఈ సినిమాలోని సంఘటనలు, నిజ జీవితంలో రోజు మనకు తారసపడేవేనని అన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు అందులోని పాత్రల్లో తమను ఊహించుకున్నారు. అందుకే ఈ సినిమా తెలుగులో ఇంత పెద్ద హిట్ అయిందని అన్నారు. ఇటీవలే తమిళంలో తెరకెక్కబోయో ఈ సినిమాకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని, త్వరలోనే చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

ఈ సినిమాకి స్వీకర్‌ అగస్తీ సంగీతాన్ని అందిస్తుండగా, గుణశేఖరన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మహా వెంకటేశ్‌ కథా సహకారాన్ని, నీలన్‌ సంభాషణలను, కపిలన్‌ పాటలను రాస్తున్నట్లు చెప్పారు. కాగా తెడియపల్లి మదన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కొరియన్ రీమేక్ అయిన ఓ బేబీ కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే మన సినిమా కోలీవుడ్ కు వెల్లడం పై ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: