ఏ ముహూర్తాన త్రివిక్రం-విజయ భాస్కర్ మన్మథుడు అని పేరు పెట్టి నాగార్జున తో సినిమా చేశారో కానీ అప్పటి నుంచి నాగ్ కి ఆ పేరు అన్నీ విధాలా సరిగ్గా సరిపోయింది. ఆ కొంటె చూపు, అమ్మాయిలని అట్రాక్ట్ చేసే చిలిపితనం ఇవన్నీ నాగార్జునకే కరెక్ట్ గా సెట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం కూడా నాగార్జునని మన్మథుడు అంటే మాత్రం కొంతమంది ఒప్పుకోవడంలేదు. 60 ఏళ్ళు వచ్చాయి కదా ఇంకా మన్మథుడు ఏంటి..? ఏదైనా కొత్తగా పిలవొచ్చు కదా అంటున్నారు. అయితే నాగార్జున మాత్రం మన్మథుడు కి సీక్వెల్ గా వస్తున్న సినిమాకోసం లుక్ పరంగా యంగ్ గా కనిపించడానికి చాలా కష్టపడుతున్నారని సమాచారం. ఎంత కష్టపడినప్పటికి వయసు తెలిసిపోతోంది.

ఒక వయసు వచ్చాక వాస్తవాన్ని అంగీకరించి ఒరిజినల్ లుక్ ను చూపించడానికి ప్రయత్నించాలి. అలా చేశారు కాబట్టే నాగ్ నటించిన సోగ్గాడే చిన్ని నాయనా పెద్ద హిట్ అయింది. సినిమా కోసం మేకప్ వేసుకుని మెయింటైన్ చేస్తే చేయొచ్చు కానీ.. అదే ఒరిజినల్ అన్నట్లుగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తేనే జనాల దృష్టిలో తక్కువ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మన్మథుడు-2 కు అదే జరుగుతున్నట్టు అనిపిస్తోంది. తెలుగులో మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే ఫిజిక్ లుక్ పరంగా అందరికంటే నాగార్జునే ముందు  నిలుస్తాడు. ఐతే బాడీ అయితే మెయింటైన్ చేస్తున్నాడు కానీ.. నాగ్ ముఖంలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పుడు 'మన్మథుడు-2' చేస్తున్న నాగార్జున వయసు ప్రభావం స్క్రీన్ మీద కనిపించకుండా ఉండేందుకు తెగ ట్రై చేస్తున్నారు. కెరీర్లో ఇంతకముందెప్పుడు వేసుకోనంతగా మేకప్ వేసుకుంటున్నాడు. ఈ విషయం 'మన్మథుడు-2' పోస్టర్లు చూస్తే క్లియర్‌గా తెలిసిపోతోంది. ఇది చాలదన్నట్లు.. ఫొటో షాప్ లో ఎడిటింగ్ కూడా చేసి పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. మరి ఇంత ప్రయత్నం చేశాక.. ఇదంతా ఒరిజినల్ అన్నట్లు కలరింగ్ ఇవ్వడమే చాలా మందికి విచిత్రంగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాతైనా వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటే నాగార్జునకి ఈ తిప్పలు ఉండవని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: