లోకనాయకుడు కమల్ హాసన్ తనయ శృతి హాసన్ గురించి మన టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సిద్దార్థ సరసన తొలుత అనగనగా ఒక ధీరుడు సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి, ఆ తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి సక్సెస్ లు అందుకుంది. కేవలం నటిగానే కాక మంచి అభిరుచిగల సంగీత దర్శకురాలిగా శృతి తమిళనాడులో ఎంతో ఫేమస్ అయింది. అంతేకాక అక్కడక్కడా ఆమె కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడడం జరిగింది. అయితే ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం సినిమాలు ఒకింత తగ్గించిన శృతి, 

ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న లాభం అనే సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుత కాలంలో టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతూ రోజురోజుకూ విస్తరిస్తూ ముందుకు పోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల 'ఫేస్ యాప్' పేరుతో ఒక సరికొత్త యాప్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ఈ యాప్ లో మన ప్రస్తుత ఫోటో అప్లోడ్ చేస్తే చాలు రాబోయే రోజుల్లో ముసలి వయసు వచ్చిన తరువాత మనం ఎలా ఉంటామో ఆ యాప్, ఫోటో ద్వారా చూపించేస్తుంది. సాధారణ ప్రజలు సహా, సెలెబ్రిటీలు సైతం ఈ యాప్ ద్వారా తమ ప్రస్తుత ఫోటోలను అప్లోడ్ చేసి ముసలివారయ్యాక ఎలా ఉంటామో అని తమని తాము చూసుకుని మురిసిపోతూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని షేర్ చేస్తున్నారు. 

అదేవిధంగా శృతి కూడా తన ముసలి వయసు ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానా అని ఒక్కసారి మనసులో తలచుకుంటే, హెవీ మెటల్ మ్యూజిక్ కు ఎక్సర్ సైజ్ చేయడం, గ్లటెన్ ఫ్రీ బ్రెడ్ తినడం వంటివి  చేసేదాన్నని గుర్తుచేసుకుంటాను అంటూ శృతి పోస్ట్ చేయడం జరిగింది. ఇక ముసలి  వయసులో ఉన్న ఆమె ఫోటోని చూసిన ఆమె ఫ్యాన్స్, బాబోయ్ శృతి అంటూ ఫన్నీ గా సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం శృతి ముసలి వయసులోని ఆ ఫోటో మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: