భారతదేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ లు కలిసి చేస్తున్న ‘RRR’ సినిమాపై బీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు నందమూరి మరియు మెగా అభిమానులు. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్టుపై యావత్ దేశ సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై ఒక కొత్త డౌట్ అభిమానులు పెట్టుకున్నారు. విషయంలోకి వెళితే ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా జులై 30వ తారీఖున వచ్చే సంవత్సరం విడుదల అవుతుందని ప్రకటించేశారు సినిమా యూనిట్ కి చెందినవారు.


అయితే ప్రస్తుతం షూటింగ్ విషయమై చాలా ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో రెండు హీరోల అభిమానులు..వచ్చే సంవత్సరానికి ఈపాటికి సినిమా విడుదల అవుతుందా అంటూ కొత్త డౌట్ తెరపైకి తీసుకువచ్చి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు పెట్టుకున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి షూటింగ్ సమయంలో గాయాలయ్యాయని దాదాపు కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆగిపోయిన క్రమంలో..ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి ఈపాటికి సినిమా విడుదల అవుతుందా..? అంటూ ప్రశ్నలు చేస్తున్నారు.


ముఖ్యంగా ఇటీవల బాహుబలి తర్వాత సాహో సినిమా ఆగస్టు 15న విడుదల అవుతుందని ప్రకటించి..వెంటనే సినిమా విడుదల చేసిన వాయిదా వేసిన నేపథ్యంలో..ఈ విధంగానే ‘RRR’ సినిమా విషయంలో కూడా జరుగుతుందోని...ఇప్పటి నుండే తెగ టెన్షన్ పడుతున్నారు నందమూరి మెగా అభిమానులు. మరి ‘RRR’ సినిమా అనుకున్న సమయానికి రాజమౌళి సినిమా విడుదల చేస్తాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: