దేవుళ్ళు దేవతలు పై లోకంలో  ఉంటారని ఆస్తికులు నమ్ముతారు. కానీ వారు వెండి తెర మీద అలా ధ్రువ తారల్లా ఉంటారని పిచ్చి అభిమానులు నమ్ముతారు. ఈ అభిమానులను చూసుకుని డెమీ  గాడ్స్ లా ఫీల్ అయ్యే స్టార్స్ ఎందరో ఉన్నారు. ఇలాంటి స్టార్స్ కి హిట్స్ కావాలి. ఫ్లాప్ అయితే వారిది కాదు, అందులో వారి వాటా లేదు. సక్సెస్ మాత్రం నూరు శాతం తీసుకుంటారు.


డైరెక్టర్ పూరీ జగన్నాధ్ లేటేస్ట్ గా ఓ హీరో గురించి చెబుతూ తనకు హిట్లు ఉంటే ఆ హీరో పలుకుతారని సెటైర్లు పేల్చారు. అది నిజమే, ఈ అనుభవం ఒక్క పూరీకే కాదు ఎంతో మంది డైరెక్టర్లది. అసలు కధ పుట్టేది, పెరిగేది సినిమా మెదడులో ఆడేది  అంటూ ఉంటే అది ఒక్క  డైరెక్టర్ ది. కధకు తగిన కాస్టింగ్ ని సెలెక్ట్ చేసుకోవడంలోనే డైరెక్టర్ టాలెంట్ ఉంటుంది.


అలా సినిమాలో ఒకరుగా  చేరిన హీరోలు ఇపుడు మొత్తం సినిమాకే మూలం అయిపోయారు. ఓ సినిమా అడితే అందులో ఎన్నో అంశ్డాలు దోహదం చేస్తాయి. వాటిని అన్నీ కంట్రోల్ చేసి మంచి అవుట్ పుట్ రాబట్టే వాడు డైరెక్టర్. కానీ హీరోలు ఆ క్రెడిట్ కొట్టేస్తారు. ఆ డైరెక్టర్ ఫ్లాప్ ఇస్తే మళ్ళీ ముఖం కూడా చూడరు. ఎందుకంటే వారు డెమీ గాడ్స్. వారికి హిట్లే తప్ప ఫ్లాప్స్ ఉండవు.


మరింత సమాచారం తెలుసుకోండి: