బాలీవుడ్ లో సోనాక్షి సిన్హాకు ఓ మంచి పేరుంది.  వివాదరహితురాలిగా,  ఎవరిని ఇబ్బంది పెట్టని నటిగా పేరుంది.  అందుకే సోనాక్షితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడతారు.  మాములుగా సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలు చేసిన తరువాత హీరోయిన్లు ప్రేమలో పడిపోతారు.  


డేటింగ్ చేస్తుంటారు.  సోనాక్షి సిన్హా ఇందుకు మినహాయింపు కాదు.  సోనాక్షి ఓ యువకుడితో ప్రేమలో పడిందట. డేటింగ్ లో కూడా ఉన్నట్టు చెప్పింది.  కానీ, ఆ విషయం ఎవరికి తెలియదని అంటోంది.   ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని అంటోంది.  


ఉద్దేశ్యాలు ఏంటి అన్నది పక్కన పెడితే.. సోనాక్షి సిన్హా డేటింగ్ విషయమే ఇప్పుడు అందరిని షాక్ కు గురిచేసింది.  చాలా అమాయకంగా కనిపిస్తుంది.  ఎవరితోనూ పెద్దగా టచ్ లో ఉండదు.  ఒకవేళ తనను మోసం చేశాడని తెలిస్తే మరుసటి రోజును అతను చూడలేదు అని ధైర్యంగా చెప్పింది అంటే అర్ధం చేసుకోవచ్చు.  


ప్రస్తుతం సోనాక్షి సల్మాన్ ఖాన్ తో దబాంగ్ 3 చేస్తున్నది.  ఈ సీరీస్ లో ఇది మూడో సినిమా.  గత రెండు సినిమాల్లో కూడా సోనాక్షినే హీరోయిన్.  స్టార్ హీరోయిన్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకో మరి అనుకున్నంతగా పేరు రావడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: