‘ఓ బేబి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లు కలక్షన్స్ తెచ్చుకున్నా ఆమూవీ ఇప్పటికీ ఓవర్సీస్ లో ఒక్క మిలియన్ డాలర్స్ కూడ కలెక్ట్ చేయలేకపోవడం సంచలనంగా మారింది. వాస్తవానికి ఈసినిమాకు ఓవర్సీస్ లో కూడ వచ్చిన టోటల్ పాజిటివ్ టాక్ తో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనాలు కట్టారు.

అయితే ఆ అంచనాలు తారుమారు అయి ‘ఓ బేబి’ ఇప్పటికీ 900కె కలక్షన్స్ మార్క్ లోనే ఉంది అని తెలుస్తోంది. దీనితో ‘ఓ బేబి’ ని నిలబెట్టడానికి అమెరికాలో 1+1 టిక్కెట్స్ ఆఫర్లు ఓవర్సీస్ ప్రేక్షకులకు ఇచ్చి ఎదో విధంగా ‘ఓ బేబి’ ని ఒక మిలియన్ మార్క్ మూవీగా మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 

వాస్తవానికి ‘ఓ బేబి’ కి ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి గల కారణం ఈసినిమాతో పాటు మంచి టాక్ తెచ్చుకున్న ‘ఏజెంట్ ఆత్రేయ’ ‘బ్రోచేవారు ఎవరురా’ అని అంటున్నారు. ఈ చిన్న సినిమాలను కూడ ఓవర్సీస్ ప్రేక్షకులు బాగా ఆదరించడంతో మంచి టాక్ తెచ్చుకుని కూడ ‘ఓ బేబి’ కి ఒక మిలియన్ డాలర్ల కల కూడ నెరవేర లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. 

దీనితో సమంత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ఓవర్సీస్ లో ప్రేక్షకులను రప్పించుకునే శక్తి లేదా అన్న కోణంలో కామెంట్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ లో సమంత ‘యూటర్న్’ ఫెయిల్యూర్ అయి కలక్షన్స్ విషయంలో చతికల పడితే సక్సస్ అయి కూడ అమెరికాలో ఇప్పటికీ ‘ఓ బేబి’ మిలియన్ మార్క్ డాలర్ కలక్షన్స్ అందుకోలేక పోవడం సమంత ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న సక్సస్ లో బయటకు చెప్పుకోలేని లోటు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: