ప్రయోగాలు చేయాలి అంటే హాలీవుడ్ వాళ్ళకే సాధ్యం.  అవును ఇది నిజమే.  ఎందుకంటే ఒక కథ అనుకున్నాక దానిని పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయగల సత్తా ఉన్న సాంకేతిక సిబ్బంది హాలీవుడ్ వాళ్ళ దగ్గర ఉన్నది.  అందుకే ఎలాంటి కథతో అయినా వాళ్ళు సినిమా చేయగలుగుతారు.  


ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.  అవతార్ సినిమాను తీసుకోవచ్చు.  అసలు అలాంటి సినిమా చెయ్యొచ్చు అనే ఊహకూడా మనకు రాదు.  ఒకవేళ వచ్చినాయి అంతటి ఖర్చుతో సినిమా చేయడం అన్నది అసాధ్యం.  కానీ, హాలీవుడ్ దర్శక నిర్మాతలు కొత్తదనం ఉండే వాటిని విపరీతంగా ఇష్టపడతారు.  


నిన్న రిలీజైన ది లయన్ కింగ్ సినిమా కూడా అలాంటిదే కదా.  రియలిస్టిక్ ఫొటోగ్రఫీతో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.  భారీ ఖర్చుతో కూడుకొని ఉంటుంది.  కానీ, దానిని ఈజీగా చేసి చూపించారు.  ఇప్పుడు ఇలాంటి సినిమానే మరొకటి రాబోతున్నది.  


అదే క్యాట్స్.  మనుషులు పిల్లులుగా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  దీనికి సంబంధించిన ట్రైలర్ నిన్ననే రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ నిజంగా బాగుంది.  కాకపోతే, పిల్లులుగా మారడం అన్నది కొద్దిగా జీర్ణించుకోలేని విషయంగా చెప్పాలి.  ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: