పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.  యూత్ కు నచ్చే సినిమాలు చేస్తూ వావ్ అనిపించుకుంటున్నాడు ఈ యువ హీరో.  అర్జున్ రెడ్డి మాస్ హిట్ ఇస్తే... 


గీతగోవిందం క్లాస్ హిట్ ఇచ్చింది.  ఈ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది.  విజయ్ రష్మిక జోడి బాగుందని టాక్ వచ్చింది.  ఇప్పుడు ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నారు.  ఈ మూవీ మ్యూజిక్ ఫెస్టివల్ షోలు నడుస్తున్నాయి. బెంగళూరు, కోచి, చెన్నై, హైదరాబాద్ లలో ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ను నిర్వహించారు.  


డియర్ కామ్రేడ్ సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాను అన్ని చోట్ల ప్రమోషన్స్ చేస్తున్నారు.  ఈ ప్రమోషన్స్ లో భాగంగానే అన్ని ప్రాంతాలను విజయ్, రష్మికలు చుట్టేస్తున్నారు.  ఏ విషయంపై కూడా భయపడొద్దు.  


ఒకవేళ అలా భయపడితే ఏమి సాధించలేము.  నచ్చిన దాన్ని వదలొద్దు.  అడుగు ముందుకు వేస్తె విజయం అదే వస్తుంది.  ఈ మాటలు అన్నది ఎవరో కాదు విజయ్ దేవరకొండనే.  ఏ విషయంలోనైనా భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా అడుగులు వేస్తె విజయం సొంతం అవుతుందని విజయ్ నిరూపించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: