గత మూడు దశాబ్దాలకు పైగా టాప్ హీరోగా రాణిస్తున్న నాగార్జున వ్యాపార వేత్తగా కూడ అనేక విజయాలు అందుకున్నాడు. సాధారణంగా ఒక కళాకారుడుకి వ్యాపార రంగానికి  సంబంధించిన తెలివితేటలు చాల తక్కువగా ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా నాగ్ సినిమాలతో పాటు అనేక వ్యాపారాలలో రాణిస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితులలో ‘సాహో’ విడుదల వాయిదా పడుతుంది అని నాగార్జునకు ముందుగానే తెలుసా అనే విషయమై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణం సినిమా నిర్మాతలు అందరూ ఆగష్టు 15న విడుదల అవుతుంది అని నిన్న మొన్నటి వరకు భయపడిన ‘సాహో’ మ్యానియాను లెక్క చేయకుండా నాగ్ తన ‘మన్మధుడు 2’ రిలీజ్ డేట్ ను ప్రకటించడమే కాకుండా ఆమూవీ ‘సాహో’ పోటీకి తట్టుకుంటుందా అన్న విమర్శలను కూడ లెక్క చేయకుండా వ్యవహరించిన తీరు.

అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎవరూ ఊహించని రీతిలో ‘సాహో’ వాయిదా పడటంతో నాగ్ ‘మన్మధుడు 2’ కు లెక్కలేనన్ని ధియేటర్లు దొరకడమే కాకుండా ఆగష్టు 15తో కలుపుకుని వచ్చే లాంగ్ వీకెండ్ ను ఉపయోగించుకునే పెద్ద సినిమాగా ‘మన్మధుడు 2’ మారింది. ఆగష్టు 15ను టార్గెట్ చేస్తూ అడవి శేషు శర్వానంద్ ల సినిమాలు విడుదల అవుతున్నా ఈ చిన్న సినిమాల కంటే ప్రేక్షకులు నాగార్జున ‘మన్మధుడు 2’ వైపే ఎక్కువగా మగ్గు చూపుతారు. 

దీనితో ‘సాహో’ విడుదల వాయిదా పడుతుందని ముందుగానే నాగ్ కు ‘సాహో’ టీమ్ నుండి లీకులు వచ్చాయా లేదంటే నాగార్జున అంచనాలు నిజం అయ్యాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా ‘సాహో’ ను కొనుక్కున్న బయ్యర్లు కూడ ఆశ్చర్య  పడుతున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా నాగార్జున సినిమాలు ఫెయిల్ అవుతున్న పరిస్థుతులలో ‘మన్మధుడు 2’ పై ఉన్న ఫ్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ తో పాటు ఇదే సమయంలో ‘బిగ్ బాస్ 3’ లో నాగ్ మ్యానియా కూడ కొంత కొనసాగుతున్న నేపధ్యంలో ‘మన్మధుడు 2’ కు అన్ని విషయాలు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: