జగపతి బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నుండి తాను తప్పుకున్న విషయమై వివరణ ఇస్తూ నిన్న విడుదల చేసిన వీడియోలో చాల ప్రశ్నలకు సమాధానాలు లేవు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. తన 33 సంవత్సరాల కెరియర్ లో తన పై ఎన్నో నెగిటివ్ వార్తలు వచ్చినా ఏ వార్త పైన అయినా స్పందించని జగపతి బాబు ఇప్పుడు ఇలా భావోద్వేగంగా స్పందించడం వెనుక చాల కారణాలు ఉన్నాయి అని అంటున్నారు.

జగపతి బాబు మాటల ప్రకారం ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటించడానికి తాను రెండు సినిమాలను వదులుకున్నానని చెపుతున్నాడు. అలాంటి జగపతి బాబు కేవలం తన పాత్ర నచ్చలేదని ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి వెళ్ళిపోలేదని అతడిని బలవంతంగా పంపించి ఉంటారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రస్తుతం ఈవిషయమై హడావిడి చేస్తున్న ఒక వార్త ప్రకారం ఈమూవీ దర్శకుడు అనీల్ రావిపూడి అనుకోకుండా అన్న ఒక మాటకు జగపతి బాబు హర్ట్ అయ్యాడనే గాసిప్పులు కూడ ఇప్పటికీ హడావిడి చేస్తూనే ఉన్నాయి. దీనికితోడు ఈమూవీ నిర్మాత దిల్ రాజ్ కు ప్రకాష్ రాజ్ పట్ల ఉండే ప్రత్యేక అభిమానం జగపతి బాబును ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి దూరం చేసింది అని అంటున్నారు.

అందుకే జగపతి బాబు నిన్న విడుదల చేసిన వీడియోలో అన్ని విషయాలలోను క్లారిటీగా మాట్లాడలేము అనీ కొన్ని విషయాల పై మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా సద్దుకు పోవాలి అంటూ పొడిపొడిగా జగపతి బాబు చెప్పిన మూడు ముక్కల సమాధానం లోనే ఈవిషయమై జగపతి బాబులో పెరిగిపోయిన అసహనం స్పష్టంగా కనిపించింది అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం ఎన్నికలలో ఓటమి తరువాత పెద్ద సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రకాష్ రాజ్ కు జగపతి బాబు అసహనం జాక్ పాట్ అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: