ఇస్మార్ట్ శంకర్ తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హిట్ కొట్టాడు. ధియేటర్ల వద్ద సరైన సినిమాలు లేక ఇస్మార్ట్ శంకర్ కోసం జనం ఎగబడుతున్నారు. మాస్ ప్రేక్షకులకు సినిమా బాగానే కనెక్టవుతోంది.


అయితే సినిమా హిట్ అయినంత మాత్రాన పూరి సక్సస్ అయినట్టు కాదంటున్నారు విమర్శకులు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో హీరో చాలా అతి చేశాడని వారు విమర్శిస్తున్నారు. మెదళ్ళ మార్పిడి అనే కాన్సెప్ట్ తప్ప సినిమాలో కొత్తదనం ఏమీలేదు.


మాస్ కు దగ్గరవ్వాలన్న ప్రయత్నంలో రామ్ భారీగా సఫలమయ్యాడు. పూరీ సినిమాల్లో ట్రీట్మెంట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. హీరోలు మాత్రమే మారతారు. హీరో మానవాతీత ఫైట్లూ, హీరోయిన్ల అందాల ఆరబోత..బీచ్ సాంగ్స్..అంతేగా పూరీ సినిమా అంటే.


కొత్తగా వచ్చిన కుర్ర దర్శకులు ఎగబడి మరీ హిట్లిచ్చేస్తుంటే పూరీ మాత్రం తన పాత మూసధోరణి వద్దే ఆగిపోయారు. అందుకే ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా దర్శకుడిగా పూరి మాత్రం సక్సస్ అయ్యారని చెప్పలేమంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: