రానా కిడ్నీ సమస్యకు వైద్యం నిమిత్తం అమెరికాకు తీసుకువెళ్ళారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈవిషయమై మరింత ఆసక్తికరమైన వివరాలను ఒక ప్రముఖ మీడియా సంస్థ వెలుగులోకి తీసుకు వచ్చింది. రానాకు కిడ్నీ ఆపరేషన్ ఎంత వరకు అవసరం అన్న విషయమై అమెరికాలోని ఒక ప్రముఖ నెఫ్రాలిజిస్ట్ అభిప్రాయం తీసుకోవడంతో పాటు ఒకవేళ రానాకు కిడ్ని ట్రాన్స్ ప్లంటేషన్ ఎంత వరకు అవసరం అన్న విషయాన్ని నిర్ధారించదానికి అవసరం అనుకుంటే కిడ్నీ ఇచ్చే వారిని టెస్ట్ చేయడానికి మాత్రమే రానా తల్లిని అదేవిధంగా రానా మేనత్తను పిలిపిమచారని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు రానాకు కిడ్నీని ఇచ్చే వ్యక్తి ఆరోగ్యం గురించి కూడ చాల లోతుగా టెస్ట్ చేస్తారని కిడ్ని ఇవ్వడం వల్ల ఆ వ్యక్తులకు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీ రావు అని నిర్థారించుకున్న తరువాత మాత్రమే రానా ఆపరేషన్ విషయంలో ఒక క్లారిటీ అమెరికన్ డాక్టర్ ఇస్తాడని అంటున్నారు. ఇది ఇలా ఉంటే రానాకు అవసరం అనుకుంటే తన కిడ్నీని కూడ ఇవ్వడానికి నాగచైతన్య సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ ఆలోచనకు సమంత నుండి నుండి ప్రోత్సాహం వచ్చినా నాగార్జున నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ఆలోచన ప్రాధమీక స్థాయిలోనే ఆగిపోయినట్లు టాక్. దీనితో రానాకు నిజంగా కిడ్నీ ఆపరేషన్ అవసరం అయితే అతడి తల్లీ నాగచైతన్య తల్లి రానా మేనత్త లలో ఎవరో ఒకరి కిడ్నీ రానాకు అమిర్చే అవకాసం ఉంది అంటూ ఆ మీడియా సంస్థ కథనం ప్రసారం చేసింది. 

అయితే  ఈవిషయమై ఇప్పటికి కూడ దగ్గుబాటి కుటుంబం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో కేవలం రానా మెడికల్ చెకప్ లు కోసమే అమెరికా వెళ్లి ఉంటాడు అన్న ఊహాగానాలు వస్తున్నాయి. సాధారణంగా కిడ్నీ ట్రాన్స్ ప్లంటేషన్ జరిగిన తరువాత ఆవ్యక్తిని  మూడు నెలల పాటు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా చాల జాగ్రత్తలు తీసుకుంటారు. దీనితో రానా నటిస్తున్న సినిమాలు చాల పెండింగ్ లో ఉన్న నేపధ్యంలో ఇప్పటికిప్పుడు రానా కిడ్ని ఆపరేషన్ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు అంటూ ఆ మీడియా కథనం అభిప్రాయ పడుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: