టాలీవుడ్ లో దర్శకధీరుడుగా పేరుగాంచిన ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా పేరుగాంచిన అద్భుతమైన డైరెక్టర్లలో ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఆయన దర్శకత్వంలో బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు ఒక దానిని మించి మరొకటి ఎంతటి అత్యద్భుత విజయాలను అందుకుని టాలీవుడ్ ఖ్యాతిని దేశవిదేశాల్లోను మారుమ్రోగించాయో మనకు విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాల విజయాల తరువాత అటు ప్రభాస్ కు, ఇటు రాజమౌళికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అనే చెప్పాలి. 

ఇకపోతే హాలీవుడ్ లో కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొంది నిన్న, ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది లయన్ కింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తో మరియు కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి గుర్తుకువస్తుంది అని కొందరు ప్రేక్షకులు సహా సినీ  విశ్లేషకులు అంటున్నారు. రాజు కావాలనే కాంక్షతో అన్ననే చంపాలని స్కార్ కుట్ర చేయడం, ఆపై సింబాను రాజ్యం వదిలిపోయేట్టు చేయడం, అనంతరం రాజుగా అధికారాన్ని చేపట్టి ప్రజల్ని హింసించడం, అలానే తన అన్న భార్యను చెరపట్టాలని కోరుకోవడం, ఇక బాహుబలిలో మాదిరిగా యువరాజుని అమరేంద్ర బాహుబలి అన్నట్టుగా పైకెత్తి రాజ్య ప్రజలకు చూపించడం, ఇక యువరాజును వెతుక్కుంటూ యువరాణి వెళ్లడం, కొడుకు వస్తాడని ఎదురుచూడటం,

ఇలా కథ పరంగా చాలావరకు ప్రతి సన్నివేశంలోనూ బాహుబలి కథ మనల్ని వెంటాడుతుంది అని వారు అంటున్నారు. అయితే లయన్ కింగ్ అనేది ఎప్పుడో వచ్చిన డిస్నీ కామిక్ అని, ఆ సినిమా కథనే రాజమౌళి కపి కొట్టారని కొందరు అంటుంటే, ఇది ఎన్నో కష్టనష్టాలతో ఆ సినిమా టీమ్ మొత్తం రేయింబవళ్లు శ్రమించి తీసిన సినిమా, కాబట్టి సినిమాని సినిమాగా  చూసి ఎంజాయ్ చేయాలని కొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విషయాలన్నీ ప్రక్కన పెడితే, ప్రస్తుతం లయన్ కింగ్ మాత్రం  ప్రేక్షకాభిమానంతో ముందుకు దూసుకెళుతోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: