బాలకృష్ణ ఒకపక్క రాజకీయాలను మరోపక్క సినిమా రంగంలో రెండింటిలోనూ ఇది చాలా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే విధంగా ఫలితాలు వచ్చినా కానీ రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెండోసారి బాలకృష్ణ గెలిచి తానేంటో నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా రాజకీయ ప్రచారం లోను మరియు బయట సినిమా ఫంక్షన్ సమయాలలో బాలకృష్ణ ఆయన అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు చాలానే వచ్చి వార్తల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకందరికీ తెలిసినదే.


ఈ విషయంపై తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎందుకు బయట మనుషులను కొడతాడో ఎక్సప్లేయిన్ చేశారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...బాలయ్య బాబు అందరిని కొట్టేస్తాడు అని అంటుంటారు. ఈ విషయం గురించి నేను వివరణ ఇవ్వాలి. పబ్లిక్ లోకి హీరోయిన్లు వెళ్ళినప్పుడు మీద పడిపోయే ఆకతాయిలు ఉంటారు. హీరోయిన్లకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది.


ఎవడు ఏ వైపు నుంచి వచ్చి మీదపడిపోతాడో తెలియదు. అందుకే ప్రమాదకరంగా తన మీదకు వచ్చే వాళ్ళని బాలయ్య కొడుతుంటారు. మిగిలిన హీరోలు ఈ పని చేయరు కాబట్టి బాలయ్య మాత్రమే అందరికి కోపిష్టిలా కనిపిస్తున్నారు. వాస్తవానికి ఆయన చాలా మంచి వ్యక్తి అని పూరి బాలయ్యని సమర్థించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నారు పూరి జగన్నాథ్. ఆ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూ లో భాగంగా పూరి ఈ విషయాలను తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: