బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కావటానికి ఇంకా ఎంతో సమయం లేదు. రేపు(ఆదివారం) రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానెళ్ళో బిగ్ బాస్ సీజన్3 ప్రారంభం కాబోతుంది. నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 3 షూటింగ్ నిన్న(శుక్రవారం) రాత్రే ప్రారంభం అయిందట. బిగ్ బాస్ సీజన్ 3 లో 14 మంది సెలబ్రిటీలు, ఒక కామన్ మ్యాన్ ఉన్నట్లు సమాచారం. 
 
ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీల విషయానికి వస్తే ఇప్పటిదాకా మనకు వినిపించిన పేర్లే ఈ షోలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, హేమ, వరుణ్ సందేశ్, వరుణ్ సందేశ్ భార్య వితికా శేరు, టీవీ9 యాంకర్ జాఫర్, సీరియల్ యాక్టర్ రవికృష్ణ, క్యారక్టర్ ఆర్టిస్ట్ హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కమెడియన్ మహేశ్ విట్టా, బాబా భాస్కర్, పునర్నవి భూపాళం, అలీ రియాజ్, రోహిణి ఈ షోలో పాల్గొనబోతున్నారట. బిగ్ బాస్ సీజన్ 2 లో ముగ్గురు కామన్ మ్యాన్లకు అవకాశం కల్పించగా ఈసారి ఒక్కరికి ఆ అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. 
 
గతంలో ఎప్పుడూ లేని విధంగా షో ప్రారంభానికి ముందే ఈ షోను వివాదాలు చుట్టుముట్టినా కోర్టు బిగ్ బాస్ నిర్వహకుల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పటంతో ప్రస్తుతానికి ఈ షోకు సమస్యలు తీరినట్లే. బిగ్ బాస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ కాగా సీజన్ 2 హిట్ మాత్రమే అయింది. మరి నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 ను ఏ రేంజ్ తీసుకెళ్తాడో చూడాలి. శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 : 30 గంటకలకు బిగ్ బాస్ సీజన్ 3 ప్రసారం కాబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: