తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  గతంలో వచ్చిన బిగ్ బాస్ 1, 2 పూర్తయిన తర్వాత ప్రశంసలు, విమర్శలు వచ్చాయి. కానీ బిగ్ బాస్ 3 ప్రేక్షకుల ముందుకు రాకముందే ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంటుంది.  బిగ్ బాస్ యాజమాన్యం తమను లైంగికంగా ఇబ్బందులకు గురి చేశారని యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్త కేసులు వేశారు. మరోవైను నిర్మాత కేతిరెడ్డి సైతం బిగ్ బాస్ అసభ్యతకు, అశ్లీలతకు కేరాఫ్ర అడ్రస్ గా మారుతుందని దాన్ని బ్యాన్ చేయాలని పోలీసులను ఆశ్రయించారు. 

మరోవైపు తెలుగు బిగ్‌బాస్ షో మూడో సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. హౌస్‌లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకరిద్దరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినా మిగతా పేర్లు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. తాజాగా ఈ సస్పెన్స్ కి తెరదింపుతూ..బిగ్ బాస్ సీజన్ 2 కంటిస్టెంట్ నూతన నాయుడు బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. 

ఆయన వెల్లడించిన పేర్ల లో నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(జంట), సీరియల్ నటుడు రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రెజా, టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్, సీరియల్ నటి రోహిణి, డబ్‌స్మాష్ స్టార్ అశు రెడ్డి ఉన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: