నాగార్జున హీరోగా చేస్తున్న మన్మథుడు 2 సినిమా ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ డేట్ ను అధికారికంగా లాక్ చేశారు.  అప్పటికి సాహో పోస్ట్ ఫోన్ కాలేదు.  మన్మథుడు 2 సినిమా రిలీజైన వారం రోజుల తరువాత సాహో వస్తుంది.  ఈ వారం రోజుల్లోనే కలెక్షన్లు రాబట్టుకోవాలి.  


తక్కువ సమయంలో కలెక్షన్లు రాబట్టుకోవాలి అంటే సాధ్యం కానీ విషయం.  ఆ విషయం అందరికి తెలిసిందే.  కానీ, నాగార్జున అంత ధైర్యంగా అదే రోజున ఎందుకు లాక్ చేసినట్టు.  కారణాం ఏమై ఉంటుంది.  సాహు తో పోటీపడితే సినిమా నిలబడుతుందా.. 


సాహు ఎలా ఉన్నాయా మొదటి వారం రోజులు కలెక్షన్ల సునామి ఉంటుంది.  దానిని ఎలా పేస్ చేయాలని నాగ్ అనుకున్నాడో అర్ధం కాలేదు.  ఎలాగైతెనేం సాహు పోస్ట్ ఫోన్ అయ్యింది.  నాగార్జున కు కలిసి వచ్చింది. అయితే, ఇప్పుడు మరో కొత్త మాట వినిపిస్తోంది.  


నాగార్జునకు సాహో రిలీజ్ వాయిదా పడుతుందనే విషయం ముందుగానే తెలుసునని, బహుశా అందుకే సినిమా రిలీజ్ విషయంలో అంతా కాన్ఫిడెన్స్ గా ఉన్నారని వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి.  సాహో ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: