యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డేరింగ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి రోజే సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో అటు ఏ సెంట‌ర్ల‌తో పాటు ఇటు బీ, సీ సెంట‌ర్ల‌లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ముఖ్యంగా సినిమా బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌ను టార్గెట్‌గా చేసుకుని పూరి తెర‌కెక్కించ‌డంతో ఈ సెంట‌ర్లలో ఇస్మార్ట్ థియేట‌ర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి.


ఊహించ‌ని విధంగా మాస్‌కు కూడా రామ్ బాగా క‌నెక్ట్ అయ్యాడు. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత ఓ మాంచి హిట్‌తో అటు పూరితో పాటు ఇటు రామ్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాకు నిర్మాత‌గా ఉన్న ఛార్మి ఆనందానికి కూడా అవ‌ధులు లేవ‌ట‌. ఇస్మార్ట్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.18 కోట్ల ప్రి రిలీజ్ బిజెనెస్ చేసింది. తొలి రోజు రూ.8 కోట్లు రాబ‌ట్టిన ఈ సినిమా... రెండో రోజు రూ.4 కోట్ల షేర్‌తో రెండు రోజుల‌కే రూ.12 కోట్ల మార్క్ షేర్ క్రాస్ చేసింది. 


ఇస్మార్ట్ శంక‌ర్ 2 డేస్‌ క‌లెక్ష‌న్స్ (రూ.కోట్ల‌లో):


నైజాం - 5.39


సీడెడ్ - 1.90 


వైజాగ్ - 1.37


ఈస్ట్ - 0.79


వెస్ట్ - 0.61 


కృష్ణ - 0.78 


గుంటూరు - 0.81 


నెల్లూరు - 0.41
--------------------------------------
ఏపీ + తెలంగాణ = 12.06 కోట్లు
--------------------------------------



మరింత సమాచారం తెలుసుకోండి: