కామిని (అమలా పాల్ ) ఇతరుల గురించి పెద్దగా ఆలోచించకుండా తన స్వార్థం తను చూసుకుంటు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతకాలని భావించే మనస్తత్వం. కొన్ని అనివార్య కారణల వల్ల ఓ బంగళాలో నగ్నంగా పడి ఉంటుంది  కామిని . అసలు కామిని ఆ బంగ్లా లోకి ఎలా వచ్చింది ? ఆమెని  ఎవరు బంధించారు ? ఆమెపై అత్యాచారం జరిగిందా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .


కామిని పాత్రలో సినిమా మొత్తం తన నటనతో  అమలా పాల్ అద్భుత అభినయం కట్టిపడేస్తుంది  మిగిలిన నటీనటులు తమతమ పాత్రలకు తమ న్యాయం చేసారు . సినిమాలో తన పాత్ర కోసం నగ్నంగా నటించి ఈ చిత్రం తనని ఎంతగా ఇన్ స్పైర్ చేసిందో చెప్పకనే చెప్పింది . అమలా పాల్ నటజీవితంలోనే మైలురాయిగా నిలిచింది ఈ చిత్రం.


కరెంట్ ఇష్యు ని ఎంచుకొని సరైన స్క్రీన్ ప్లే రాసుకొని బోల్డ్ నెస్ మాత్రమే కాదు మంచి సందేసంతో దాన్ని తెరపైకి అద్భుతంగా తీసుకువచ్చి మెప్పించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు రత్నకుమార్. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి , విజువల్స్ తో కట్టిపడేసారు . సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది 

పాసిటివ్స్ : 
అమలా పాల్
కథ 
దర్శకత్వం


నెగిటివ్స్ : 
కామెడీ


మరింత సమాచారం తెలుసుకోండి: