సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి నటవారసత్వంతో సినిమాల్లోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చన మహేష్ బాబు, చిన్నప్పుడే తన ఆకట్టుకునే నటనతో అందరి మనసులు దోచాడు. ఇక పెరిగి పెద్దయి హీరోగా మారాక, కెరీర్ పరంగా ఎన్నో ఎత్తు పల్లాలు దాటుకుని తండ్రి కృష్ణ గారి వలే మంచి సక్సెస్ లు మరియు పేరు సంపాదించి అభిమానుల పాలిటి సూపర్ స్టార్ గా ఎదిగారు. 

ఇక నమ్రతతో వివాహానంతరం మరిన్ని విజయాలు తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్, తన కుటుంబం గురించి ఎప్పటికపుడు అభిమానులతో కలిసి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకుంటూ ఉంటారు. ఇక అయన కుమారుడు గౌతమ్, మరియు కుమార్తె సితారలకు సంబందించిన లేటెస్ట్ ఫోటోలు అభిమానులకు షేర్ చేసే సూపర్ స్టార్ కు, అచ్చంగా తన తల్లిని పోలి ఉండే, కూతురు సితార అంటే ఎనలేని అభిమానం. ఇక సితారకు ఇప్పటినుండే మహేష్ అభిమానుల మద్దతు లభిస్తోంది. మూడురోజుల క్రితం వంశీ పైడిపల్లి కూతూరు ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ చానల్ ని స్టార్ట్ చేసిన సితార, అప్పుడే తన టాలెంట్ తో అభిమానులను సంపాదించుకుంటోంది. అభిమానులు ముద్దగా లిటిల్ ప్రిన్సెస్ అని పిలుచుకునే సితార 7వ జన్మదినం నేడు. 

ఇకపోతే ఈ వేడుకను పురస్కరించుకుని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఘట్టమనేని అభిమానులు పెద్ద ఎత్తున సామజిక, సేవా కార్యక్రమాలు చేయడానికి సంకల్పించారు. అంతేకాదు సితార పేరుతో ట్విట్టర్ లో స్పెషల్ బర్త్ డే కామన్ డిస్ప్లే ఫొటో మరియు హ్యాష్ ట్యాగ్ ని షేర్ చేస్తూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు. మరి ప్రస్తుతం సితారకు వస్తున్న ఫాలోయింగ్ మరియు క్రేజ్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో తండ్రి సూపర్ స్టార్ మహేష్ ని దాటి ముందుకు దూసుకుపోతుంది అని అనడంలో ఆశ్చర్యం లేదంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: