గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా సీతారా ఎంటర్టైన్మెంట్ సంస్థల్లో వచ్చిన సినిమా జెర్సీ, ఈ ఏడాదిలో ఈ సినిమా నాని కాతాలో మరో హిట్ ని చేర్చింది. ఇప్పుడు ఇదే సినిమాని తమిళంలో కూడా రీమేక్ చేస్తున్నట్లు సమాచారం తెలిపారు.



ఇందులో హీరో పాత్ర కోసం తమిళ నటుడు విష్ణు విశాల్ ను సంప్రదించినట్లు సినిమా పరిశ్రమల్లో వార్త వచ్చాయి. ఈ చిత్రానికీ నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి తెలుగు హీరో రానా దగ్గుబాటి నిర్మాతగా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రాణా ఎటువంటి సమాచారాన్ని తెలపట్లేదు.



ఇది ఇలా ఉండగా జెర్సీ చిత్రాన్ని తమిళంలోనే కాకా హిందీలో కూడా రీమేక్ చేస్తున్నట్లు సమాచారం తెలిసింది. హిందీ హక్కులను మన ప్రముఖ దర్శకులు అల్లు అరవింద్, దిల్ రాజ్ సొంతం చేసుకున్నారని వాళ్ళు తెలిపారు. ఇందులో హీరోగా షాయిద్ కపూర్ ను తీసుకుంటున్నట్లు సమాచారం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: