సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముద్దు గుమ్మా 'సితార'ను ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏదొక చిలిపి పనితో నెటిజన్లను, మహేష్ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ, అలరిస్తుంటుంది ఈ పిల్ల రక్షేసి. సితార చేసే చిలిపి పనులు అన్ని మహేష్ బాబు, నమ్రత వీడియోలు, ఫోటోలు రూపంలో నెటిజన్ల కోసం సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంటారు.  


ఈ నేపథ్యంలో సితార పాపా ఈ మధ్యనే 'అధ్య vs సితార' అంటూ ఓ 'యూట్యూబ్ ఛానల్'ను ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఈ పాపా గురించి ఎందుకు చెప్తున్నాం అని అనుకుంటున్నారా ? కారణం ఉంది.. ఈ రోజు సితార పాపా పుట్టిన రోజు. ఈ సందర్బంగా పాపకు సోషల్ మీడియా వేధికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


అయితే పాపా యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసినప్పుడు నుంచే ఆ వీడియోలో సూపర్ తల్లి నువ్వు అంటూ కామెంట్ చేస్తున్న నెటిజన్లు అప్పుడే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటూ వీడియో కామెంట్ బాక్స్ ను బద్దలు కొట్టారు. ఇది చూస్తుంటే అర్థం అవుతుంది. 6 ఏళ్లకే సితార పాపకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది. మహేష్ ఫ్యాన్స్ అంత సితారకి ఫ్యాన్స్ అయిపోయారు. రాబోయే రోజాలలో కాబోయి సినీ తార మన సితార అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: