ఎన్నాళ్ళో వేచిన స‌మ‌యం ఈనాడే వ‌చ్చిందంటూ క‌త్రినాకైఫ్‌ను చూసిన ప్రతి ఒక్కరూ తెగ పాడేసుకుంటున్నారు. ఎంతో కాలంగా కత్రినాకైఫ్‌,ర‌ణ్‌భీర్‌క‌పూర్‌ల మ‌ధ్య ఎఫైర్ కొన‌సాగుతుండ‌టంతో, వీరిద్దరికి పెళ్ళి జ‌రుగుతుందా ? లేదా ? అనేది అంద‌రి ప్రశ్న.క‌త్రినాకైఫ్‌ను ఎప్పుడు అడిగినా మాది మంచి రిలేష‌న్ మాత్రమే, నో కామెంట్ అంటూ వెళ్ళిపోతుంది. ఇదే విష‌యాన్ని ర‌ణ్‌భీర్‌ను అడిగితే జ‌స్ట్ ప్రెండ్‌షిప్ మాత్రమే అంటూ త‌నూ వెళ్ళిపోతాడు.

బాలీవుడ్ విశ్వస‌నీయ స‌మాచారం మేర‌కు క‌త్రినాకైఫ్‌,ర‌ణ్‌భీర్‌క‌పూర్ ఇద్దరూ 2014, జూన్‌లో మ్యారేజ్ చేసుకునే ఆలోచ‌న‌లు ఉన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ ఇతర సెల‌బ్రిటీలు కూడ ఈ న్యూస్‌లో నిజం ఉందంటున్నారు. గ‌త కొంత కాలంగా ర‌ణ్‌భీర్‌,క‌త్రినా ఇద్దరూ వ్యక్తిగ‌తంగా చాలా ద‌గ్గరగా క‌లిసి ఉంటున్నారు. బీచ్‌లు, టూర్లు అంటూ ఇద్దరూ ప‌ర్సన‌ల్ లైఫ్‌ను ప్రవేట్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఎట్‌ప్రెజెంట్ క‌త్రినాకైఫ్ నాలుగు మూవీల్లో న‌టిస్తుంది. వాటిల్లో రెండు మూవీల‌కు సంబంధించిన షూటింగ్స్‌ను 2014, మార్చిలోపు పూర్తి చేయాల‌నుకుంటుంది. ఆ త‌రువాత మిగ‌తా రెండు మూవీల‌ను జులై నెల నుండి వ‌రుస‌గా బ‌ల్క్ కాల్షీట్స్‌ను ఇచ్చింది. మ‌ధ్యలో ఉన్న మూడు నెల‌లో ఒక్క షూటింగ్‌ను కూడ పెట్టుకోలేదు. ర‌ణ్‌భీర్ క‌పూర్ షెడ్యూల్స్ కూడ అదే నెల‌లో ఖాళీగా ఉన్నాయి. దీంతో వీరిద్దరూ జూన్ నెల‌లో ఒక‌టి అవుతున్నారంటూ మీడియా ప‌సిగ‌ట్టేసింది. విచారిస్తే, క‌త్రినా పెళ్ళి జూన్ నెల‌లో ఖాయం అనే స‌మాచారం తెలిసింది. ఎట్టకేల‌కు వీరిద్దరూ త్వర‌లోనే పెళ్ళికి సిద్దం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: