నాగార్జున వయసు ఎంత అంటే సడెన్ గా చూసిన వాళ్ళెవరైనా సరే ఓ 40 ఉంటుందేమో అనుకుంటారు.  కానీ అసలు విషయం ఏంటంటే ఆగష్టు 29 వ తేదీకి నాగ్ కు 60 ఏళ్ళు వస్తాయి.  ఆ వయసులో మాములుగా వ్యక్తులు ఎలా ఉంటారు.  పేస్ లో ముడతలు వచ్చి.. జుట్టు రంగు మారిపోయి ముసలితనం కనిపిస్తుంది.  


నాగార్జున విషయంలో మాత్రం అది కనిపించదు.  ఇప్పటికి చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.  కొడుకులతో పోటీపడి వాళ్ళకంటే అందంగా యవ్వనంగా కనిపిస్తున్నాడు.  మన్మథుడు అంటే అసలు అర్ధం నాగార్జునే అనే విధంగా మారిపోయాడు.  


ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కినేని కుటుంబానికి చెందిన కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి.  ఆ ఫోటోలు చూస్తే అందరు షాక్ అవుతారు.  ఎందుకంటే.. పేస్ యాప్ ఛాలెంజ్ ద్వారా ఫిల్టర్లును ఉపయోగించి 60 ఏళ్ళు వచ్చాక ఎలా ఉంటారు అని చూస్తే..చైతన్య, అఖిల్ లు పూర్తిగా మారిపోయారు.  అటు సుశాంత్ కూడా అంతే మార్పు. 


నాగార్జునలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సహజంగా అలానే ఉన్నాడు.  చూసిన వాళ్లంతా నాగార్జున వీళ్ళకంటే చిన్నవాడేమో అనుకుంటున్నారు. ఫిట్నెస్ విషయంలో నిత్యం నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.  తప్పని సరిగా డైట్ ను ఫాలో అవుతాడు.  అందం విషయంలో నాగ్ వద్ద చిట్కాలు తీసుకోవాలని మంచు లక్ష్మి అక్కినేని హీరోలకు సూచించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: