కెరీర్ మొదట్లో బాగానే హిట్లిచ్చిన సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కు గత పదేళ్ళుగా సరైన హిట్లు లేవు. కొన్ని సినిమాలైతే ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలీని పరిస్థితి. హీరోగా కెరీర్ వదిలేసి రాజశేఖర్ విలన్ గా మారాలనుకునే సమయంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు గరుడవేగ కథ చెప్పాడు. తన మార్కెట్ కు మించిన సినిమా అని తెలిసినా భారీ బడ్జెట్తో గరుడవేగ సినిమాలో నటించాడు రాజశేఖర్. గరుడవేగ సినిమా హిట్ అవ్వటంతో రాజశేఖర్ హీరోగా బిజీ అయినట్లే అని అందరూ అనుకున్నారు. 
 
గరుడవేగ హిట్ అయినందుకు తరువాత సినిమా కల్కి కూడా భారీ బడ్జెట్తో నిర్మించారు నిర్మాతలు. ఈ సినిమాకు దాదాపు 20కోట్ల దాకా ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. సినిమా విడుదలకు ముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆరు కోట్ల రుపాయలకు అమ్మేశారు నిర్మాతలు. థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల దాకా అమ్ముడుపోయాయి. కానీ సినిమాకు యావరేజ్ టాక్ రావటంతో కలెక్షన్లు అనుకున్న స్థాయిలో రాలేదు. ఈ సినిమాకు కేవలం 4 నుండి 5 కోట్ల మధ్యలో షేర్ వసూళ్ళు వచ్చాయి. 
 
గత నెల జూన్ 28వ తేదీన విడుదలైంది కల్కి సినిమా. ఈ సినిమాకు పోటీగా విడుదలైన బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలు హిట్టవ్వడంతో యావరేజ్ టాక్ వచ్చినా కల్కి సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. 20 కోట్ల బడ్జెట్ పెడితే కేవలం 5 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయంటే సినిమా ఏ రేంజ్ డిజాస్టరో ఊహించుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: