రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మొదటి రోజు ఏకంగా వరల్డ్ వైడ్ 16 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 7.80 కోట్ల షేర్ వ‌చ్చింది. రామ్ కెరీర్‌లోనే ఇవి హ‌య్య‌స్ట్ తొలి రోజు వ‌సూళ్లు. ఈ ఓపెనింగ్స్ కే హిట్ అందామా ? ఇస్మార్ట్ శంకర్ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టేనా ? అంటే ఇంకా ముందు చాలా క‌థే ఉంది. అప్పుడు సంబ‌రాలు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.


ఇస్మార్ట్ శంక‌ర్ ఏపీ, తెలంగాణ‌లో రూ.18 -19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు రోజుల‌కు రూ.12 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమా అదనంగా మరో 7-7 కోట్ల రూపాయలు సంపాదించాలి. ఇప్ప‌టికే మిక్స్‌డ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. తొలి రెండు రోజులు వ‌సూళ్లు బాగానే ఉన్నా ఇప్ప‌టి నుంచే ప‌రీక్ష స్టార్ట్ అయ్యింది.


తొలి వారం ఆగితే డియర్ కామ్రేడ్, గుణ, రాక్షసుడు లాంటి సినిమాలు వస్తున్నాయి. వాటిని తట్టుకొని మరీ ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు సాధించాల్సి ఉంది. ఈ వారం రోజుల్లో వీలున్నంత మేర‌కు వ‌సూళ్లు రాబ‌ట్టుకోక‌పోతే త‌ర్వాత క‌ష్ట‌మే. ఇప్ప‌టికే ఓ బేబీ లాంటి సినిమాలు బాగా ర‌న్ అవుతున్నాయి. తొలి వారంలో స‌క్సెస్ కాక‌పోతే ఇస్మార్ట్ బ‌య్య‌ర్లు మునిగిపోతారు. 


బయ్యర్ల సంగతి పక్కనపెడితే నిర్మాతలుగా పూరి, చార్మి మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఈ సినిమాను మంచి రేటుకు అమ్ముకున్నారు వీళ్లు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి అటుఇటుగా 36 కోట్ల రూపాయలకు సినిమాను అమ్మేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: