అమ్మాయి వేషంలో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా నవ్వులు పండించే వినోద్ పై హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ కాచిగూడ దగ్గర కొందరు వినోద్ పై దాడి చేశారు. ఈ దాడిలో వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది.


తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానే ఈ దాడి చేయించినట్టు వినోద్ అనుమానిస్తున్నాడు. ఈ మేరకు ఇంటి యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వినోద్. వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు.


జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ తో అందరి దృష్టినీ ఆకర్షించిన వినోద్ మొదటి నుంచి కూడా వివాదాల్లో ఉన్నాడు. పెళ్లి విషయంలో ఇంట్లోవారితో గొడవ పడి ఆత్మహత్యాయత్నం చేశాడని వార్తలు వచ్చాయి.


ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. ఆ ఘటనపై వినోద్ మీడియాకు వివరణ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ తాజా వివాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. హత్యాయత్నం చేసేంతగా ఇంటియజమానితో వినోద్ కు ఉన్న గొడవలేంటన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: