పూరీ జగన్నాధ్ రాం గోపాల్ వర్మ శిష్యుడు. ఆయనలాగానే ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, సంచలనాలకు తెర తీయడం పూరీకి అలవాటు, ఇక హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మూవీస్ చేసుకుపోవడంలోనూ గురువు బాటే మరి. అంతే కాదు వివాదాస్పదమైన కామెంట్స్ చేయడంలోనూ పూరీ వర్మకు డిటో. డిటో.


ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు మీద భారీ పంచ్ చేసి చల్లగా చోద్యం చోస్తున్నాడు పూరీ. హిట్లు ఉండే డైరెక్టర్ల వెంట మహేష్ పడతాడని పూరీ అన్న మాటలు మహేష్ కి ఎక్కడో తగిలాయి. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ ఈ విషయంలో హాట్ హాట్ గా ఉన్నారు. మహేష్ వంటి కూలెస్ట్ పర్సనాలిటీ మీద కామెంట్స్ చేసి ముగ్గులోకి లాగడం ఏంటి అని పూరీ మీద మండిపడుతున్నారు.


మరో వైపు తన మీద పూరీ వేసిన పంచులను వూరికే వదలకుండా రివర్స్ పంచులు వేయాలని మహేష్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మహేష్ ఈ మధ్య మరీ అంత మెత్తగా ఉండడంలేదు. ఎక్కడికక్కడ కౌంటర్లు వేస్తూ తన దైన మార్క్ చూపిస్తున్నాడు. గతంలో సుకుమార్ కి ఇలా ఓ ఆడియో ఫంక్షన్లో మహేష్ కౌంటరిచ్చాడు కూడా. ఇక పూరీ ని కూడా కరెక్ట్ టైంలో ఆడుకుంటాడని అంటున్నారు. మరి అందుకోసమేనా పూరీ వెయింటింగ్ అని అంటున్నారంతా..



మరింత సమాచారం తెలుసుకోండి: